గడ్డం గ్యాంగ్ ను ఇలాగే బతిమాలుతారా? ..అచ్చెన్నాయుడు
గుడివాడలో టీడీపీ కార్యకర్తలపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన గడ్డం గ్యాంగ్ నేత మెరుగుమాల కాశీ, వరి వెనకున్న కొడాలి నానిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావును హతమారుస్తామని గడ్డం గ్యాంగ్ బహిరంగంగా హెచ్చరిస్తుంటే పోలీసులేం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. గడ్డం గ్యాంగ్‌ను బతిమాలడమే వారి చేతగానితనానికి నిదర్శనం అన్నారు. రేపు వారిపై ఇష్టారాజ్యంగా దాడి చేసినా ఇలాగే బతిమాలుతారా? అని ప్రశ్నించారు. గుడివాడలో టీడీపీ నేతలు రంగా వర్ధంతి నిర్వహిస్తే వైసీపీకి వచ్చిన నొప్పేంటి? రంగాను చంపడంలో తప్పు లేదన్న గౌతమ్‌రెడ్డికి పైబర్‌నెట్ చైర్మన్ పదవినిచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. గుడివాడలో ఇద్దరు కాపు సోదరుల మరణానికి నాని కారణమయ్యారు. తనకు కాపులంతా వ్యతిరేకం కావడంతో దాన్ని దారి మళ్లించేందుకు రెచ్చగొట్టే పనులు ప్రారంభించారు అని విమర్శించారు.













