ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఖరారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కసరత్తు కొలిక్కి వస్తోంది. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు పేరు ఖరారైంది. ఇదే పదవికి ఒక దశలో ప్రచారంలోకి వచ్చిన బీద రవిచంద్ర యాదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఆయనకు వివిధ అనుబంధ సంఘాల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారని సమాచారం. పనిభారం దృష్ట్యా ప్రధాన కార్యదర్శులు మరికొందరు కూడా ఉండబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు అచ్చెన్నాయుడు పేరుకే సీనియర్లు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది.













