విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం : విజయసాయి రెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు తామెంత మాత్రమూ ఒప్పుకునే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీ్ల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంపీ విజయ సాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా నడుస్తాయని, అందుకే సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.













