చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మస్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదానలు విన్న న్యాయస్థానం పిటిషన్లను డిస్మిస్ చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన ఆయన తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మరికొన్ని వాదనలు వినిపిస్తానని పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో 6వ తేదీన మరిన్ని అంశాలను ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ వాదనలు వినిపిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇచ్చారని, రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా రెండు పిటిషన్లను డిస్మస్ చేస్తూ తీర్పు వెలువరించింది..













