చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ.. రేపల్లె పోలీస్ స్టేషన్ ముందు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయతాన్నికి పాల్పడ్డారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ రేపల్లె మండలం మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన మంగమ్మ పోలీస్ స్టేషన్ ముందు ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్మ చేసుకునేందుకు యత్నించారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని ఒంటిపై నీళ్లు చల్లారు. వెంటనే మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. చంద్రబాబును విడుదల చెయ్యాలంటూ పోలీసు స్టేషన్లోనూ మహిళ వేడుకుంది.













