Prime Minister Modi :ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీకి విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖ (Visakhapatnam) లో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. రైల్వే జోన్ (Railway zone), పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి భారీ రోడ్ చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.













