Yanam :470 రకాల వంటకాలు… యానాంలో కొత్త అల్లుడికి మెగా విందు
గోదారోళ్ల మాటలకే కాదు, ఆతిథ్యానికీ ప్రత్యేకత ఉంటుంది. పండగొచ్చిందంటే గోదావరి జిల్లా (Godavari District) ల ప్రజల ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలో గోదావరి జిల్లా మించినవారు లేరంటే అతిశయోక్తికాదు. ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతం యానాం(Yanam) వర్తకసంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్(Satyabhaskar,) వెంకటేశ్వరి (Venkateswari ) దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు.
శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కమార్తె ఇద్దరినీ ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాల ఉంటాయని ఇప్పుడే చూశాను అని అల్లుడు సాకేత్ తెలిపారు.













