ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తిలో సత్యసాయి 93వ జయంతి వేడుకలు వేణుగోపాలస్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి, పట్టణ వీధుల్లో వేలాది మంది భక్తులు సాయి నామస్మరణతో ముందుకు లాగారు. ఉభయ రాష్ట్రాల భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20న ఆధ్యాత్మిక సదస్సు, 22న సత్యసాయి విశ్వవిద్యాలయం 37వ స్నాతకోత్సవం జరగనున్నాయి. 23న సాయి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. 24న అంతర్జాతీయ యువ సమ్మేళనం నిర్వహిస్తారు. వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.













