దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్లాలని ఎస్పీ, ఐజీలను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిందితుడిని పట్టిచ్చివారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. తొమ్మిదేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ రాస్తారోకో చేశారు. దీంతో అద్దంకి, నార్కెట్పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.













