79మంది టీడీపీ నేతలకు బెయిల్ .. హైకోర్టు
చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్న 79 మంది నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై విడుదలైన వారు ప్రతి మంగళవారం పోలీస్స్టేషన్లో హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఇవే కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మరో 30 మంది టీడీప నేతలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారందరినీ తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.













