పార్టీ నడపటానికి అర్హత వైసీపీకే ఉందా? మాకు లేదా? : పవన్
పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పార్టీ నడపటానికి అర్హత వైసీపీకే ఉందా? మాకు లేదా? అని ప్రశ్నించారు. ఒక్కసారి జనసేనవైపు చూడమని ప్రజలకు కోరుతున్నా అని అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తుంటే సీఎం తనకు కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందుతున్నా డబ్బు మాత్రం కొందరి వద్దే ఉండిపోతుందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థల బలోపేతమవుతాయి. వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో మాకు తెలుసు. వైసీపీ ఎంపీలు ప్రధాని ముందు నోరు మొదరపు అన్నారు. రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. జనసేన ఆవిర్భవించింది భావితరాల కోసమే. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవు. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తెలుస్తాం. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ది చెబుతారు అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో వైసీపీ ప్రభుత్వం చెప్పాలి. గుడివాడలో ఇసుక దందా నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.













