ఉక్రెయిన్ నుంచి 757 మంది విద్యార్థులు ఏపీకి
ఉక్రెయిన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకూ 757 మంది విద్యార్థులు స్వస్థలాలకు తిరిగివచ్చారని ఏపీ ఉక్రెయిన్ టాస్క్ఫోర్స్ కమిటీ వెల్లడించింది. ఉక్రెయిన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 770 మంది విద్యార్థులు చదువుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వారిలో 757 మంది స్వస్థలాలకు చేరుకున్నట్లు తెలిపింది. మరో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. మరో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు పోలాండ్లోని తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాడని, మరొక్కరు ఉక్రెయిన్లోనే ఉంటానని తెలియజేసినట్టు తెలిపింది. ఇందులో ఆరుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులని కమిటీ వెల్లడించింది.













