635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవం
రాష్ట్రానికి వచ్చిన 635 అవార్డులు మన అద్భుతమైన పనితీరుకు నిదర్శనం
హామీలు ఎన్నో ఇచ్చారు. చట్టంలో చెప్పిందే చేయడం లేదు, ఇక ఇచ్చిన మాటలకు విలువ ఏముంది?
కేంద్రంపై మాకు వ్యతిరేకత కాదు, చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే అభ్యంతరం చెబుతున్నాం.
ఇక్కడ నా వెనుక ఉన్న ఈ పురస్కారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే కదా.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మెచ్చుకుని ఇచ్చినవే కదా
జల వివాదాలు మంచివి కావు. ఇప్పటికే నష్టపోతున్నాం. నదుల అనుసంధానం ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. కానీ, కేంద్రం ఆ పనిచేయడం లేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీటా స్వాగతోపన్యాసం
ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం
జిల్లా, గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పనకు సమాయత్తం కావాలి.
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాం.
నిర్ణీత లక్ష్యాలను సాధించుకోవడంలో సానుకూల, ఆశావహ దృక్పధంతో ఉండాలి.
6వ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమం గ్రామాలు, వార్డులలో పండగ వాతావరణంలో జరగనున్నాయి. గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళికలను వెల్లడించడానికి ఈ సభలే వేదికలు.
ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సభలలో అవగాహన కల్పించాలి.
జిల్లా స్థాయి సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ల సమావేశం దిక్సూచిగా నిలుస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం
కలెక్టర్ల సమావేశాలు మేధోమధనానికి ఉపకరిస్తున్నాయి. ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా వుంది.
కలెక్టర్లు అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవం
రాష్ట్రానికి వచ్చిన 635 అవార్డులు మన అద్భుతమైన పనితీరుకు నిదర్శనం
చేసిన పనిని ఎవరూ గుర్తించలేకపోవడం అంటూ ఉండదు.
కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది.
విభజన సమయంలో ఎదురైన సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయి.
సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారు.
మనం సిద్ధంగానే ఉన్నాం. వచ్చే ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారు.
కోర్టులు కూడా వస్తున్నాయి. విమానయాన సర్వీసులు లేవు. వాటిని వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారు.
నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నాం. పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావు.మన పనితీరుకు ఈ అవార్డులే రుజువు.
కాంక్రీట్ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెక్రటేరియెట్ ర్యాఫ్ట్ పనులకు నిన్న శ్రీకారం చుట్టాం.
ఎయిర్‌షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారోర అర్ధం అవుతోంది.
పోలవరం ఒక రియాలిటీ
2019లో పోలవరం కాలువల ద్వారా నీళ్లు అందిస్తాం.
వ్యవసాయ ఉద్యానంలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలోఉంది.
ఇచ్చిన కాసిన్ని నీళ్లకే అనంతపురం ఉద్యాన రైతులు అద్భుత ఫలితాలను సాధించారు.
రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే అది రానున్న రోజులలో హార్టీకల్చర్ హబ్‌గా మారుతుంది.
ఉద్యానంలో పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువ.
రాయలసీమలోని నాలుగు జిల్లాలు రానున్న కాలంలో ప్రాథమిక రంగంలో ప్రధమంగా ఉంటారు.
కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం కారణాలుగా ఆక్వా కల్చర్‌లో ప్రకాశం జిల్లా వెనుకబడి వుంది.
కేంద్రం సహకరించకున్నా మన కష్టంతో 10.52% గ్రోత్ రేటు వచ్చింది
రైతుల ఆదాయం రెట్టింపు చేశాం
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీళ్లు ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది. అభివృద్ధికి వీలైన వాతావరణం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో అభివృద్ధి సాధ్యం కావడం లేదు.
నాలుగైదు సంవత్సరాలలో నీరు, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎన్ని సమస్యలు వచ్చేవో ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. కేవలం పట్టిసీమ వల్ల నీళ్లు ఇవ్వడం వల్లనే అనేక సమస్యల నుంచి గట్టెక్కగలిగాం.













