ఏపీలో రెండో దశ.. 539 పంచాయతీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడత ఈ నెల 13న జరగనున్నాయి. ఇదిలా ఉంటే రెండో దశ ఎన్నికల్లో ఎస్ఈసీ ఏకగ్రీవాలను ప్రకటించింది. 13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని సృష్టం చేసింది. గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 57, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 41, కడప జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 36, విశాఖ జిల్లాలో 22, తూర్పు గోదావరి జిల్లాల్లో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని సృష్టం చేసింది. ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 పంచాయతీల్లో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.













