రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలు
వైసీపీ ఎంపీలు ముందుగా ప్రకటించినట్టుగానే లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజాన్కు కలిసి వారి రాజీనామా లేఖలను ఆమెకు సమర్పించారు. రాజీనామా లేఖను సమర్పించినవారిలో ఎంపీ మేకపాటి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, అవినాస్ రెడ్డి అన్నారు. సభ నిరవధిక వాయిద పడిన అనంతరం స్పీకర్ చాంబర్లో ఆమెను కలిశారు. రాజీనామా చేయడానికి గల కారణాలను స్పీకర్‌కు వివరించారు. అయితే ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా లేదా పెండింగ్‌లో ఉంచుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్లో నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ప్రభుత్వం ఎంపీల దీక్షకు అనుమతిచ్చింది.













