ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే
భద్రాద్రి జిల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళన దిగారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఫీుభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు భారీగా ఘటనాన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రికత్తత చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడే భారీగా మోహరించారు.













