అమరావతి నిర్మాణానికి పంచ సూత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరింత సమర్థంగా, నాణ్యంగా, పారదర్శకంగా నిర్మించేందుకు ఐదు సూత్రాల వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) అధికారులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యం, తక్కువ వ్యయం, వేగం, ఉత్తమ విధానాలపై నిరంతర అధ్యయనం, నాణ్యత అనే ఐదు అంశాలు రాజధాని నిర్మాణంలో తప్పకుండా అనుసరించాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ఇంజినీరింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్న కట్టడాలను పరిశీలించి, ఆ విధానాలను హరిత రాజధాని అమరావతిలో వాడాలని సూచించారు. రాజధాని పనుల నాణ్యతను పర్యవేక్షించేందుకు సీఆర్డీఏ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి, పనుల పురోగతిపై నెలవారీగా ప్రజలకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు సృష్టం చేసినట్లు రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులశాఖ ఓ ప్రకటనలో తేలిపింది.













