వాలంటీర్ల పై వైసీపీ కక్ష సాధింపు..
ఆంధ్రాలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలతో.. పార్టీలు హడావిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంస్థను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్లతో పార్టీ కార్యక్రమాలు చేయించుకుంటుంది. వాళ్లకు ఇచ్చే జీతాలు 20వేలకు పెంచి.. వారి చేత ఈ రెండు నెలలు పని చేయించుకోవాలని అధికార పార్టీ అనధికారికంగా సూచించింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో పై 33 మంది వాలంటీర్లను ప్రభుత్వం రాత్రికి రాత్రి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు వాలంటీర్లను ప్రభుత్వం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదు అనే కారణం చేత తొలగించారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుండా.. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నందుకే ఆ వలంటీర్లను తొలగించారు అని టీడీపీ, జనసెన పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలు అని వారు ఆరోపిస్తున్నారు.













