MLC :కోలాహలంగా కూటమి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ముగ్గురు, పట్టభద్రుల నియోజకవర్గాలనుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ మోషేస్రాజు వీరితో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి ఎన్నికైన సోము వీర్రాజు (Somu Veerraju), జనసేన నుంచి కొణిదెల నాగేంద్రరావు (Konidela Nagendra Rao) (నాగబాబు), టీడీపీ నుంచి బీటీ నాయుడు (BT Naidu) , పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్ (Rajasekhar) , ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) లతో విడివిడిగా చైర్మన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.













