ఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలీ…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయం డైరెక్టర్గా భరత్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ను నియమించింది. ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సైతం అదనపు బాద్యతలు అప్పగించింది. గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్గా జి.ఎస్.నవీన్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













