స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురి అరెస్ట్
విజయవాడ లోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాలరావు, జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ నిర్వాహకులతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.













