పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్ వేకు 192 గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను రికార్డు సమయం లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ప్రపంచంలో సాగు నీటి ప్రాజెక్టుల స్పిల్ వేల్లో ఇంత బరువైన గడ్డర్లను వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరికి 50 లక్షల క్యూసెక్యుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,128 మీటర్ల పొడువుతో స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వేకు 49 పిల్లర్లను (పియర్స్) 52 మీటర్ల ఎత్తున ఇటీవల ప్రభుత్వం రికార్డు సమయంలోనే పూర్తి చేసింది.













