అమరావతి కోసం …151 గంటల నిరాహారదీక్ష
పాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతు చేస్తున్న నిరసన దీక్షు 52వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, రాయపూడిలో మహాధర్నాు, 24 గంట నిరాహారదీక్ష, వెగపూడిలో 151 గంటల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగాయి. వెగపూడిలో రిలే దీక్షాశిబిరం కొనసాగింది. వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేకు కనువిప్పు కలిగి రాజధానిపై మనసు మార్చుకోవాలని బొర్రా రవి, తాటికొండ శ్రీకర్ చేస్తున్న 151 గంట నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగింది. వైద్యులు వీరిద్దరికీ వైద్యపరీక్షలు చేశారు. రక్తపోటు సాధారణం కంటే కొంత ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరాహార దీక్ష చేశారు. దీక్షకు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణ మూర్తి సంఫీుభావం తెలిపారు. ఆలయాల్లో పూజు చేసుకునేందుకు 10 మంది సమావేశమయినా పోలీసులు అనుమతించని పరిస్థితి నెలకొందని నన్నపనేని విమర్శించారు.













