ఎన్నికల ముంగిట 14 సమస్యాత్మకమైన నియోజకవర్గాలు ఇవే..
మే 13న జరగబోయే ఎన్నికలు ప్రస్తుతం ఆంధ్రలో హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. అభ్యర్థులకు, ఓటర్లకే కాదు నిర్వహించే అధికారులకు సైతం చెమటలు పట్టించే నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏపీలో 14 నియోజకవర్గాలను సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా గుర్తించారు. అవే..పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు. ఇక్కడ జరగబోయే ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. 100% వెబ్ కాస్టింగ్ తో పాటు భారీ సంఖ్యలో ఇక్కడ CRPF బలగాలను కూడా మోహరించినన్నారు.













