ఏపీలో కొత్తగా 10,373 కేసులు.. 80 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,441 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,46,468 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో 80 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 11,376 మంది మరణించారు. 24 గంటల్లో 15,958 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,97,08,031 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.