ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం : నారాయణ
ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్లకు సూచించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్‌తో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు వీడియో కాన్పరెన్స్‌కు హాజరయ్యారు.













