ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజుకు 50వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రానున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, తెలంగాణలోని బాసర, వేములవాడ ఆలయంల్లో కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.













