ఎఫ్బీలో వారిద్దరూ టాప్
2017 సంవత్సరానికి ఫేస్బుక్ అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిలిచినట్లు ఆ సంస్థ తెలిపింది. లోక్సభ సభ్యులో మోదీ, రాజ్యసభ సభ్యులో సచిన్ అగ్రస్థానంలో నిలిచారని వెల్లడించింది. ఈ ర్యాంకుల్ని ఫేస్బుక్లో సాగిన చర్చలు, లైక్లు, షేరింగ్, కామెంట్ల ఆధారంగా కేటాయించినట్లు పేర్కొంది. ఈ జాబితాలో బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆ పార్టీ నేత ఆర్కే సిన్హా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ భగవంత్ మన్ కూడా చోటు దక్కించుకున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.













