లింక్డిన్ లిస్ట్ లో మోదీ, ప్రియాంక కు చోటు
ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ ఇన్ అత్యంత శక్తిమంతమైన ప్రొపైల్స్ జాబితా లో ప్రధాని నరేంద్రమోదీ, నటి ప్రియాంక చోప్రాలు చోటు సంపాదించారు. 2017 సంవత్సరానికి గాను భారత్కు సంబంధించి అత్యంత శక్తిమంతమైన ప్రొపైల్స్, ఎక్కువమంది చూపిన ప్రొపైల్స్ జాబితాను లింక్డ్ ఇన్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ వరుసగా మూడో సారి చోటు సంపాదించారు. లింక్డ్ ఇన్లో ఆయనను 22 లక్షల మంది అనుసరిస్తున్నారు. జాబితాలో మొత్తం 50 మంది చోటు సంపాదించగా, వారిలో నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిప్లా సీపీఓ ప్రబీర్ ఝా, షయోమీ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ మను కుమార్ జైన్ తదితరులు ఉన్నారు.













