రక్తదానం చేసిన నారా బ్రాహ్మణి, ఉపాసన
హెరిటేజ్ పుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనలు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఫేస్బుక్ ఆధ్వరంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, సినీనటుడు రామ్చరణ్ భార్య ఉపాసన హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్మీడియా ద్వారా తెలిపారు. బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. నేను, బ్రాహ్మణి రక్తదానం చేశాం. మీరు 18 సంవ్సరాల నుంచి 90 రోజులకు ఓ సారి రక్తదానం చేస్తే, 60 సంవత్సరాలు వచ్చే సరికీ 500 మందిని కాపాడగలుగుతారు. రక్తదానం చేయడం చాలా పవర్పుల్, సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం అని ఉపాసన ట్వీట్ చేశారు. ఉపాసన సోషల్మీడియాలో చాలా చురుకుగా ఉంటుంటారు. ఆరోగ్య నియమాలు, పోషక విలువలు, ఫిట్నెస్ గురించి అవగాహన కల్పిస్తూ వీడియోలను షేర్ చేస్తుంటారు. తన భర్త రామ్చరణ్ పొటోలు, వీడియోలను కూడా ఆమె సోషల్మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.













