ఘనంగా జరిగిన నాగ్ పూర్ ఆంధ్ర అసోసియేషన్ వేడుకలు
మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ సాంస్కృతిక వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఆంధ్ర రాష్ట్ర డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదులు ఆకుల రమ్యకుమారి, ఎం.వెంకటేశ్వరి అతిధులుగా హాజరయ్యారు. లిఈ సందర్భంగా ప్రదర్శించిన బాలనాగమ్మ బుర్రకధ ఆహుతులను ఎంతగానో అలరించింది. నాగ్పూర్ ఆంధ్రా అసోసియేషన్ కార్యదర్శి పీ.ఎస్.ఎన్.మూర్తి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. అసోసియేషన్ అద్యక్షుడు ఆర్.మురళీధర్ పాలకవర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు తెలుగువారు వందల సంవత్సరాల క్రితమే వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న తెలుగువారి కోసం నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమంలో అభినందించారు. మరొక పాలకవర్గ సభ్యురాలు ఎ.జగదాంబ వందన సమర్పణ చేశారు. భవిష్యత్తులో నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.













