ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జబితాలో ముశేష్ టాప్
టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో సంచలనం సృష్టించిన భారత మొబైల్ వినియోగదారులకు అంతర్జాలం లభించేటట్లు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 25 మంది పారిశ్రామికవేత్తల జాబితాలో ముఖేష్దే తొలిస్థానం. వేగవంతమైన, చౌక ధరకే ఇంటర్నెట్తో పాటు ఉచిత వాయిస్ కాల్స్నూ అందిస్తూ జియో ఆరు నెలల్లోనే 10 కోట్ల మందిని ఆకర్షించింది. ఈ జాబితాలో అంబానీతో పాటు గృహోపకరణ సంస్థ డైసన్ను స్థాపించిన జేమ్స్ డైసన్, అమెరికా గ్లోబల్ పెట్టుబడి నిర్వాహణ కార్పొరేషన్ బ్లాక్ క్రాక్ సహ వ్యవస్థాపకుడు లారీఫింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ మహమ్మద్ బిన్ సల్మాన్, స్నాప్ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ స్పీగల్, చైనీస్ రైడ్ షేరింగ్ దిగ్గజం దిది చుక్సింగ్ వ్యవస్థాపకుడు చోటు దక్కించుకున్నారు.













