ముకేశ్ అంబానీ కూతురు పెళ్లి ఎక్కడో తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తనయ ఈశా అంబానీ వివాహ ముహూర్తం ఖారారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పూర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించోతున్న ఈశా, ఆనంద్‌ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.













