మిసెస్ ఇండియా-2017గా మమతా త్రివేదీ
మిసెస్ ఇండియా-2017గా హైదరాబాద్‌కు చెందిన మమతా త్రివేదీ ఎంపికయ్యారు. ఈ నెల 4న చెన్నైలో నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 48 మంది పాల్గొనగా 45 ఏళ్ల వయస్సు పైబడిన మమత తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి మిసెస్ ఇండియా-2017గా ఎంపికయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌కు చెందిన మమత తండ్రి వింధ్యాచల్ త్రిపాఠీ వృత్తి రీత్యా 50 ఏళ్ల కిందటే నగరానికి వచ్చి అత్తాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పట్టభద్రురాలైన మమత మోడలింగ్ రంగం పట్ల ఆసక్తితో ఆ రంగంలో కొనసాగుతూ వచ్చారు. 1990లో అత్తాపూర్‌కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ పంకజ్ త్రివేదీని పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమార్తె, కుమారుడు. మోడల్‌గా రాణిస్తూనే నాలుగు నెలలుగా కష్టపడి మిసెస్ ఇండియా పోటీలకు సన్నద్ధమైనట్లు మమత తెలిపారు.













