జూలై 12 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 12వ తేదీ నుంచి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెల రోజులపాటు కొనసాగే వీటిని ఆగస్టు 11న ముగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ)కి ప్రతిపాదన పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటి ఈ నెల 20 తర్వాత సమావేశం కానుంది. అప్పుడే వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సారి సమావేశాలను కాస్త ముందుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.













