PM Modi: ట్రంప్‌ను ఎవాయిడ్ చేసేందుకు మోడీ ప్రయత్నాలు: కాంగ్రెస్
మలేసియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తప్పించుకునే ప్రయత్నంలోనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తన ‘ఎక్స్’ ఈ మేరకు పోస్ట్ పెట్టారు.
“ప్రపంచ నాయకులను కౌగిలించుకుని, తనను తాను విశ్వగురువుగా చాటుకునే అవకాశాన్ని మోడీ కోల్పోయారు. ట్రంప్ కూడా సదస్సులో ఉండటమే ఆయన వెళ్లకపోవడానికి కారణం” అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మోడీ (PM Modi) హాజరు కాలేదని రమేశ్ గుర్తు చేశారు.
ట్రంప్ రష్యా చమురు, ‘ఆపరేషన్ సిందూర్’ వంటి విషయాలను ప్రకటించినప్పుడు మోడీ మౌనంగా ఉన్నారని చెప్పిన జైరాం రమేశ్ (Jairam Ramesh).. ట్రంప్‌తో మోడీకి విభేదాలు కొనసాగుతున్నాయని, అందుకే ఇప్పుడు ఆయన్ను కలవడానికి మొగ్గు చూపడం లేదని ఆరోపించింది.







