తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణులకు శుభాభినందనలు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయలు నెరవేరాలని కోరుకుంటున్నానని మరో ట్వీట్ పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పటైన సంగతి తెలిసిదే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుండగా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే.













