వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: రాహుల్
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వములోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆట కట్టించామని.. అప్పట్లో ఆ రాష్ట్రంలో జవాన్లుగానీ, ప్రజలు కానీ ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు లేవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని మోడీ నేతృత్వములో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, మెహబూబాముఫ్తీ నేతృత్వములోని పీడీపీ ప్రభుత్వం కాశ్మీర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రోజు ఎక్కడో ఓ చోట హింస జరుగుతూనే ఉందని అన్నారు. కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్న రాహుల్..2019 సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లోక్సభ స్థానాలను కైవశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందని..మోడీజీకి రైతుల సంక్షేమం పట్టదని విమర్శించారు.













