ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్(ఇసీ) విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులల నియోజకవర్గం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనున్నది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుది గడువు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్లు ఈసీ తెలియజేసింది.













