50 ఏళ్ల తర్వాత ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడు
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకేలో 50 ఏళ్ల తర్వాత అధ్యక్షుడి మార్పు జరిగింది. పార్టీ సర్వసభ సమావేశంలో డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ ప్రకటించారు. పార్టీ కోశాధికారిగా దురూ మురుగన్ ఎన్నికయ్యారు. స్టాలిన్ ఎన్నికతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి నినాదాలు చేశారు. అన్నాదురై, కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తిగా స్టాలిన్ నిలిచారు.













