మిథాలీకి అరుదైన గౌరవం
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బిబిసి సంస్థ ప్రకటించిన వంద ప్రభావిత మహిళల జాబితాలో మిథాలీకి చోటు దక్కింది. 2017 సంవత్సరానికి గాను బిబిసి ప్రకటించిన శక్తివంతమైన మహిళల జాబితాలో భారత సారథి మిథాలీకి స్థానం లభించడం విశేషం. కెప్టెన్‌గా, క్రికెటర్‌గా మిథాలీ టీమిండియాను నడిపిస్తున్న తీరును పరిగణలోకి తీసుకొని మిథాలీని దీనికి ఎంపిక చేశారు. ప్రపంచ క్రికెట్లో మిథాలీ తన పేరిట ఎన్నో చారిత్రక రికార్డులను లఖించుకున్న విషయం తెలిసిందే. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. సారథిగా టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లింది. ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకున్న బిబిసి మిథాలీని దీనికి ఎంపిక చేసింది.













