ప్రపంచ రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్
మహిళల క్రికెట్లో భారత స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ కొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమన్‌గా ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్థసెంచరీ సాధించిన మిథాలీ 34వ పరుగు వద్ద ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెల్ ఎడ్వర్డ్ (5992) పేరిటున్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 6028 పరుగులున్నాయి. 183 వన్డేలు ఆడిన మిథాలీ, 164వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఎడ్వర్డ్స్‌తో పోల్చుకుంటే ఆమె 16 ఇన్నింగ్స్ తక్కువ ఆడింది.













