యోగాతో జ్ఞాపకాలు పదిలం!
వృద్ధాప్యంలో జ్ఞాపకాలు మసకబారడం సహజమే. అయితే, ఈ పరిస్థితిని యోగాతో తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ యోగసనాలు వేయడం ద్వారా మెదడు చురుకుగా ఉంటుందని వివరించారు. వయసు పైబడే కొద్దీ మెదడు నిర్మాణంలో, పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. సెరెబ్రల్ కార్టెక్స్ పలుచబడిపోతుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. అయితే, యోగా ఈ పరిస్థితిని అడ్డుకుంటుందని బ్రెజిల్ పరిశోధకులు చెబుతున్నారు. నిత్యం యోగా చేసే వారి మెదడులో వృద్ధాప్యం కారణంగా వచ్చే మార్పులు నెమ్మదిస్తాయని, సెరెబ్రల్ కార్టెక్స్ దళసరిగా ఉంటుందని వివరించారు.













