విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్
ఎట్టకేలకు విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ని నిర్ణయిస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన యుపి, వామపక్షాలు పలు పేర్లను పరిశీలించాయి. అధికార ఎన్‌డిఎ కూటమి అనూహ్యంగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించడంతో ఖంగుతున్న యుపిఏ కూడా తమ తరపున దళిత వ్యక్తినే రాష్ట్రపతిగా ఎన్నిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటకే ప్రచారంలో ఉన్న మాజీ గవర్నర్, గాంధీ మనుమడుతోపాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మనుమడు ప్రశాశ్ అంబెడ్కర్, మాజీ మంత్రి షిండే, మాజీ స్పీకర్ మీరా కుమార్ల పేర్లను సమావేశంలో పరిశీలించారు. షిండే పోటీకి విముఖత వ్యక్తం చేయటం, ప్రకాశ్ అంబేడ్కర్ సైతం గెలుపుకు తగ్గ మెజార్టీలేదంటూ తప్పుకోవటంతో వామపక్షాల నేతలతో సహా అంతా మీరాకుమార్ వైపే మొగ్గు చూపారు. దళిత వర్గానికి చెందని వ్యక్తిగానే కాకుండా మహిళగా కూడా మీరా కుమార్ కొన్ని ఓట్లు చీల్చగలరన్న భావన సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనికి తోడూ బాబు జగ్జీవన్‌రామ్ కుమార్తె కావటం గతంలో ఇండియన్ ఫారెస్ సర్వీసులలో మీరా సేవలందించి ఉండటం కలిసివచ్చే అంశంగా విపక్షాలు భావిస్తున్నాయి.













