మోసగించే ఎన్నారై భర్తలకు కళ్లెం
పెళ్లి చేసుకున్నాక భార్యను వదిలేసి విదేశాలకు పరారయ్యే ఎన్నారై భర్తల ఆటకట్టించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నది. ఇలాంటి భర్తలకు సమన్లు, వారెంట్లు జారీ చేసి కోర్టు బోనులో నిలబెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పోర్టల్‌ను రూపొందించనున్నది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం తెలిపారు. పోర్టల్‌ను రూపొందించే ముందు సీఆర్పీసీకి సవరణ తీసుకురావాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇలాంటి సమన్లు/ వారెంట్లు పోర్టల్‌లో పెడితే ఆ ఎన్నారైలకు సమన్లు జారీ చేసినట్లుగానే జిల్లా మేజిస్ట్రేట్ భావిస్తారని మంత్రి తెలిపారు. సమన్లకు స్పందించకుండా మొండికేస్తే ఆ వ్యక్తిని పరారీలో ఉన్న నేరగాడిగా పరిగణించి, ఇండియాలోని అతని ఆస్తులను అటాచ్ చేస్తారు.













