మాయావతి రాజీనామా
బిఎస్పి చీఫ్ మాయవతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. యూపిలోని షహరాన్‌పూర్ జిల్లాలో దళితులపై ఇటీవల చోటు చేసుకున్న హింసపై రాజ్యసభలో తాను మాట్లాడుతున్నపుడు సభాపతి తనను అడ్డుకోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమె తెలిపారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలిసి, తన రాజీనామాను ఆయనకు అందజేశారు. నా రాజీనామా లేఖను సమర్పించేందుకు చైర్మన్‌ను నేను కలిశాను. నాకు దగ్గరగా ఉన్న సమస్యలపై సభలో నేను మాట్లాడ రాదని చెప్పడం సరికాదు. నా ప్రసంగాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. అధికార పార్టీ సభ్యులు లేచి నిలబడి నా ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇది మంచిది కాదు అని రాజీనామా అనంతరం మాయావతి మీడియాకు తెలిపారు.













