పాకిస్థాన్ వెళ్లనున్న మాజీ ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోనున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ వేడుక జరగనున్నది. మాజీ ప్రధాని మన్మోహన్తో పాటు పంజాబ్ సీఎం మరీందర్ సింగ్ కూడా కర్తార్పూర్ వెళ్లనున్నారు. కొన్ని రోజుల క్రితం కర్తార్పూర్ ప్రారంభోత్సవానికి రావాలంటూ మన్మోహన్కు ఆహ్వానం అందింది. అయితే ఆ వేడుకలో పాల్గొనేందుకు మన్మోహన్ వెళ్లడం లేదని కాంగ్రెస్ వర్గాలు మొదట్లో వెల్లడించాయి. దీనిపై మరో క్లారిటీ వచ్చింది. అఖిల పక్ష పార్టీ నేతలతో కలిసి పాక్కు మన్మోహన్ వెళ్లనున్నట్లు తాజాగా తెలిసింది. గురునానక్ 550వ జయంతి వేడుకల్లో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారు.













