బిజెపి పారిపోతోంది…ఖర్గే
లోక్సభలో అవిశ్వాసం తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం కావాలనే సభను వాయిదా వేయించుకుని అవిశ్వాసంపై చర్చ జరగకుండా పారిపోతోందని కాంగ్రెస్ సభ్యుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. సభ వాయిదా అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడారు. అన్నాడీఎంకే చేత కేంద్రమే సర్కార్ ఆందోళన చేయిస్తున్నదన్నారు. తాము సభలో కావేరీ జలాలపైనా, ఏపీకి ప్రత్యేక హోదాపైనా కూడా మాట్లాడతామని ఖర్గే అన్నారు. అవిశ్వాసంపై చర్చలో అన్ని విషయాలూ ప్రస్తావిస్తామన్నారు. ఈ రోజు ఉదయం స్పీకర్ ను ప్రధాని కలిశారనీ, రవాణా మంత్రి కలిశారనీ, వారు స్పీకర్ తో ఏం మాట్లాడారో తెలియదనీ కానీ స్పీకర్ సభకు వచ్చి వాయిదా వేసి వేళ్లిపోయారనీ ఖర్గే ఆరోపించారు. గత 16 రోజులుగా సభ ఇలాగే వాయిదా పడుతూ వస్తున్నదన్నారు. సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడడానికి చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయనీ, అందుకే ప్రభుత్వం భయపడి చర్చకు రాకుండా పారిపోతున్నదని విమర్శించారు.













