ఉప రాష్ట్రపతి రేసులో విద్యాసాగర్ రావు?
ఉప రాష్ట్రపతి రేసులో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరు తెరపైకి వచ్చింది. దేశంలోని రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉప రాష్ట్రపతికి ఆయన పేరును పరిశీలిస్తున్నారనే వార్త ఇప్పుుడు చర్చనీయంగా మారింది. ఆగస్టు 11తో ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను ఎన్డీయే తరపున బీజేపీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో, ఉప రాష్ట్రపతి పదవిని దక్షిణాది వ్యక్తికి కట్టబెట్టాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ పదవికి విద్యాసాగర్ రావు పేరు ఖరారయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.













