మాధురీ విజయ్‌కి ప్రతిష్ఠాత్మక పురస్కారం
యువ రచయిత్రి మాధురీవిజయ్(32)ని ప్రతిష్ఠాత్మక క్రాస్ వర్డ్ బుక్ అవార్డు (జ్యూరీ కేటగిరీ) వరించింది. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఆవిష్కరించిన ది ఫార్ ఫీల్డ్ నవలకు గాను ఈ పురస్కారం లభించింది. బెంగళూరులో జన్మించిన మాధురి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ది ఫార్ ఫీల్డ్ ఆమె రచించిన తొలి నవల. ఆ నవలకు భారత్‌లో అత్యంత ఖరీదైన సాహిత్య బహుమతిగా పేరున్న జేసీబీ ప్రైజ్ (సాహిత్యం) తోపాటు టాటా లిటరేచర్ లైఫ్ ఫస్ట్ బుక్ అవార్డును ఇప్పటికే గెలుచుకున్నారు. సల్మాన్ రష్ధీ, విక్రమ్ సేఠ్, కిరణ్ దేశాయ్ వంటి ప్రఖ్యాత భారతీయ రచయితలు గతంలో క్రాస్‌వర్డ్ బుక్ అవార్డును గెలుచుకున్నారు.













